Friday, January 9, 2009

రాగాల పల్లకిలో కోయిలమ్మా...

రాగాల పల్లకిలో కోయిలమ్మా.. రాలేదు వేళ ఎందుకమ్మా!
రాలేదు వేళ కోయిలమ్మా... రాగాలే మూగబోయినందుకమ్మా!

పిలిచినా రాగమే... పలికినా రాగమే కూనలమ్మకీ...
మూగ తీగ పలికించే వీణలమ్మకీ...
పిలిచినా రాగమే... పలికినా రాగమే కూనలమ్మకీ...
మూగ తీగ పలికించే వీణలమ్మకీ...
బహుశా అది తెలుసో ఏమో... లల లాల్లల లలలలల లలలా...
గడుసు కోయిలా...
రాలేదు తోటకీ వేలా!

రాగాల పల్లకిలో కోయిలమ్మ... రాలేదు వేళ ఎందుకమ్మా!

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ...
కంటి పాప జాలికి లాలీ పాడినప్పుడూ...
గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ...
కంటి పాప
జాలికి లాలీ పాడినప్పుడూ...
బహుశా తను ఎందుకనేమో... లల లాల్లల లలలలల లలలా... జాణ కోయిలా...
రాలేదు తోటకీ వేళా!

రాగాల పల్లకిలో కోయిలమ్మా... రానేల నీవుంటే కూనలమ్మా... కూనలమ్మా!

PS: ఎందుకో ఇవాళ పాట మరీ మరీ గుర్తుకొస్తోంది... ఎక్కడుందో కోయిలమ్మ!

1 comment:

SOPETI said...

మీ కోయిలమ్మ ఎక్కడుందో నాకు తెలియదు కానీ...
ఈ పాట మాత్రం నా MP3 ప్లేయర్ లో ఉంది
టోక్యో సబ్ వే ట్రైన్ లో నాకు తోడుగా ...
one of my all time faves !

TX for posting !