కొంచెం ఆశలు, కొన్ని కలలు, కొన్ని కళలు, కొంచెం చిలిపితనం, ఇంకొంచెం కొంటెతనం, వీటితో పాటే కొంచెం తిక్క, వెరసి నేను... నా పేరు గోపాల్... తాత పేరు, చిన తాత పేరు కలిపి మా వాళ్లు "వెంకట గోపాల రావు" అని పెట్టినా, అందరూ గోపాల్ అని ఫిక్సయిపోయారు... నేను కూడా ఇదే బావుంది కదా అని సరి పెట్టుకున్నాను... టూకీగా నా గురించి చెప్పాలంటే... గోదావరి జిల్లాలో ఓ బుల్లి పల్లెటూరిలో పుట్టి పెరిగి, విశాఖ పట్టణంలో అడుగు పెట్టి, డిప్లొమా + ఇంజినీరింగ్ పూర్తి చేసి, అక్కడితో చాలదని, ఏదో ఊడపొడిచేద్దామని IISc లో స్థానం సంపాదించి, రెండేళ్ళ ఆ నరకం నుంచి బతుకు జీవుడా అని బయటపడి, చివరికి ఇదిగో ఈ పూణే పట్టణంలో టాటా వారి రీసెర్చి కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాను... ఎంత రీసెర్చి ఉద్యోగామయినా రోజుకి తొమ్మిది గంటలు ఒకే కుర్చీలో కూర్చోమంటే ఎలా చెప్పండి??? పెనంలో వేగుతున్న పోపు గింజలాగా బుర్ర అంతా వేడెక్కిపోతోంది... ఆ వేడి కాస్త చల్లార్చుకుని సేద తీరాలని ఇలా బ్లాగువనంలో ప్రవేశించి, ఈ వనంలో అప్పటికే ఉన్న మొక్కల్నీ, వాటి పూల సువాసనల్నీ, చల్ల గాలినీ ఆస్వాదించి, నా వంతుగా ఈ చిరు మొక్కని నాటుతున్నాను... మరి ఎంత వరకూ ఎదుగుతుందో, ఎలాంటి పూలనీ సువాసనల్నీ వెదజల్లుతుందో చూద్దాం మరి!
నీ జ్ఞాపకం
1 year ago